ఈ కార్యక్రమంలో భాగంగా పరిసర గ్రామాల్లో ప్రతి ఇంటికి వీధి కుళాయిలు లేక త్రాగు నీటి సమస్య, కరెంట్ కొరత, డ్రైనేజ్ సమస్య, రోడ్ సమస్య, మరి ముఖ్యంగా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయని, ప్రధానంగా రాష్ట్రం లో అనేక జిల్లాలకు వర్తకులు ఇక్కడ నుంచే పూవ్వులు అనేక కార్యక్రమాలకు తీసుకెళ్తారని ఆటువంటి పూల మార్కెట్ ఇప్పటికీ అలాగే ఉంది.
పూల వ్యాపారులు, రైతులు, అనేక సమస్యలతో వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారనీ, తన బాల్యం నుంచి చూస్తున్నాననీ, ఎన్ని పార్టీలు గెలిచిన ఎంత మంది రాజకీయ నాయకులు వచ్చిన ఎటువంటి మార్పు లేదని, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు చాలా సమస్యలు ప్రతి గ్రామం లో నేను గమనించాననీ, నన్ను గాని మీరు రానున్న ఎలక్షన్ లో గెలిపించి అసెంబ్లీ కి పంపితే ఆ సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార మార్గం చూపిస్తానని గ్రామస్థులకు తెలియజేసారు.