వైసీపీ ఇంచార్జిగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

శ్రీకాళహస్తి నియోజక వర్గ వైసీపీ ఇంచార్జిగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.



శ్రీకాళహస్తి: నియోజక వర్గ వైసీపీ ఇంచార్జిగా మరోసారి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని నియమిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ దపా ఎమ్మెల్యేస్థానంలో కొత్త నేతకు ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తారంటూ వదంతులు చక్కర్లు కొట్టాయి. అయితే ప్రభాత దర్శిని మాత్రం ఎమ్మెల్యేకే వైసీపీ ఎమ్మెల్యే టిక్కెట్టు అని స్పష్టం చేసింది. అయినా కొన్ని ఛానెళ్లు, ప్రసార మాధ్యమాల్లో ఈ సారి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని మార్చి మరో కొత్త వారికి ఇంచార్జి బాధ్యతలు ఇస్తారని జోరుగా ప్రచారం చేయడం జరిగింది. అయినా జనం కోసం జగన్ నినాదంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులో అడుగు వేస్తూ వున్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డినే వైసీపీ అధిష్టానం ప్రకటించడం జరిగింది. దీంతో నియోజక వర్గంలోని వైసీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. అలాగే ప్రభాతదర్శిని వార్తే నిజమైందని, ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డినే ఇంచార్జి బాధ్యత వరించిందని పాఠకుల్లోను, రాజకీయ వర్గాల్లో విశ్వాసం పెరిగింది.