నేను రాజకీయ నాయకుడ్ని కాను ప్రజల సేవకుడ్ని.... దుక్కేరి. ప్రభాకరరావు బీజేపీ నేత
2024 సార్వత్రిక ఎన్నికల్లో పాడేరు నియోజకవర్గం నుండి MLA గా పోటీచేస్తాని బీజేపీ అధిష్టానం నాకు టికెట్ ఇస్తుందని ఆశభావం వెక్తం చేశారు,వెనుకబడిన పాడేరు నియోజకవర్గంన్ని అభివృద్దె నా లక్ష్యం...నాకు అందరూ సమానమే నాకు కులా,మతా,ప్రాంతా బేధం లేదు మనమందరం మనుషులమే... అందరి ఐక్యమత్యంతో ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది..
గిరిజన ప్రాంతంలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు. బీజేపీ అధిష్టానం బీజేపీ పార్టీ నాకు MLA టిక్కెట్ ఇస్తే గిరిజన ప్రాంతా ప్రజల దీవెనలతో నా ప్రజలకు సేవా చేసుకొంటాను అని అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి / ASR జిల్లా బీజేపీ సోషల్ మీడియా కన్వినర్ దుక్కేరి. ప్రభాకరరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ...నా పేరు దుక్కేరి. ప్రభాకరరావు, MSC కంప్యూటర్ సైన్స్ వరకు విద్యను అభ్యశించి మా తండ్రి గారిని నాకు ఊహ తెలిసిన నాటినుండి 40సంవత్సరాలనుండి మాజీ MLA., MVV సత్యనారాయణ గారితో, గొడ్డేటి దేముడు, మాజీ మంత్రి పసుపులేటి. బాలరాజు, సంకాడ గ్రామం నుండి వీరన్న పడల్ లాంటి గిరిజన ప్రాంతా రాజకీయ నాయకులతో ప్రత్యక్షంగా చూస్తూ చిన్ననాటి నుండి ఇప్పటి వరకు బీజేపీ రాజకీయ పార్టీలో నాన్నగారి పనిచేసే రాజకీయ ఆయన పనిని గమనిస్తూ పెరిగాను. నాన్న అధికారం సాధించాకున్న ప్రజలకు ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేసిన వ్యక్తి. నాన్న గారి బాటలో నా రాజకీయ ప్రయాణం 2018 సంవత్సరం నుండి ప్రత్యక్ష రాజాకీల్లోకి లోకుల.గాంధీ శిష్యులుగా మొదటి కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానిస్తూ మొదటి రోజే GK వీధి మండలం యువమోర్చా అధ్యక్షులు బాధ్యతలు స్పీకరించి, 2019 నాటిలో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థిగా మరియు బీజేపీ పార్టీ MPTC అధ్యర్దిగా పోటీ చెయ్యటం జరిగింది. తరువాత బీజేపీ పార్టీలో జిల్లా స్థాయిలో అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి బాధ్యతలో పని చేస్తూ అధిష్టానం పిలుపుతో ఎన్నో కార్యక్రమాలు చెయ్యటమే కాకుండ బయట జరిగే సమావేశాలు విశాఖపట్నం నెల్లూరు మధ్యప్రదేశ్ బోపాల్ ప్రధానమంత్రి గారి సమావేశానికి హాజరు కావటం.. అలాగే బీజేపీ పార్టీ ఆదేశాలతో హల్ప కాళిక విస్తరక్ గా తెలంగాణా రాష్ట్రంలో పది రోజులు పార్టీ నిర్దేశించిన పనిని పూర్తి చేసి నివేదిక సమర్పించి రావటం జరిగింది. అంతే కాకా బీజేపీ పార్టీ పెద్దలు నా పనితనం చూసి అల్లూరి సీతారామరాజు జిల్లా బీజేపీ పార్టీ సోషల్ మీడియా కో కన్వినర్ బాధ్యతలు ఇవ్వటం, ప్రస్తుతం అల్లూరి జిల్లా బీజేపీ సోషల్ మీడియా కన్వినర్ గా బాధ్యతలు ఇవ్వటం నేను బీజేపీ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తూ ఎంతోమంది నూతన కార్యకర్తలకు పార్టీలో ఆహ్వానిస్తు బీజేపీ కేంద్ర ప్రభుత్వం పథకాలు ప్రజలకు చేరేలా ప్రచారం చేస్తూ నా వంతు బీజేపీ పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను. నేను రాజకీయ ప్రస్థానం ముందు నుండి గిరిజన ప్రాంత ప్రజలకు సేవా కార్యక్రమాలు మొదలు పెట్టి 2019 సంవత్సరాలనుండి జై ఆదివాసీ జై భీమ్ అధ్యక్షుడిగా స్వచ్చంద సేవా సంస్థను ఏర్పాటు చేసి వాట్సాప్ గ్రూప్ పెట్టి గిరిజన సమస్యలు మా దృష్టికి వచ్చిన ఎంతోమంది విశాఖపట్నం KGH హాస్పిటల్ నందు వైద్యం అందకా ఇబ్బంది పడేప్రజలకు మంచి వైద్యం అందేలా చూస్తూ, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అత్యవసర సమయాల్లో బాధితులకు రక్తం అందించటం, వైద్యంలో, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి నేను ఆర్థిక సహాయం చెయ్యటంతో పాటు ఆర్థిక సహాయం చేసే ప్రతి ఒక్కరి దగ్గర నుండి ఆర్థిక సేకరణ చేసి బాధితులకు ఆర్థిక సహాయం చెయ్యటం, స్థానిక KGH హాస్పిటల్ డాక్టర్స్ తో మరియు గిరిజన ప్రాంతంలో పనిచేసే ITDA PO గారితో జిల్లా కలెక్టర్ గారితో DM&HO అధికారులతో గిరిజన ప్రాంత ప్రజల సమస్యలకోసం అధికారులతో మాట్లాడి అనేక సమస్యలు పరిష్కరించటం జరిగింది. అంతే కాకా గ్రామంలో వ్యాధుల కోసం మెడికల్ క్యాంప్స్ కావచ్చు, త్రాగునీరు లేని గ్రామాలకు మంచినీటి బోరింగ్స్ కొట్టించటం కానీ, గ్రామాలలో రవాణా కోసం తారురోడ్డు నిర్మాణం చేయించటం, పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఇంటర్ మీడియేట్ APR కాలేజీల్లో చీట్లు ఇవ్వాలని అధికారులతో మాట్లాడి చేర్పించటం, గిరిజన ప్రాంతంలో నిరుద్యోగ యువతకు ప్రయివేట్ కంపినిలలో ఉద్యోగాలు ఇప్పించటం, ఇలా బీజేపీ పార్టీ నాయకుడిగా పార్టీకి పని చేస్తూ, ప్రజల సేవకుడిగా సేవా చేస్తూ ప్రజల మన్నానాలు పొందుతూ నా జీవితా పయనం సాగుతుంది. అంతే కాకా నేను BACK TO BACK ఎలక్ట్రానిక్ మీడియా న్యూస్ ఛానల్ లో ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలా బ్యూరో చీఫ్ గా పనిచేస్తు గిరిజన ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలు అధికారుల దృష్టికి, సమాజానికి చూపిస్తూ, సమాజం అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తున్నాను. అంతే కాకా ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు అందించాలని, అనేక స్వచ్చంద సేవా సంస్థలతో కలిసి పని చేస్తున్నాను. అవి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ సభ్యునిగా, మరియు AP SC ST BC మైనారిటీ అసోసియేషన్ సంస్థ తరుపున పాడేరు నియోజకవర్గం అధ్యక్షుడుగాపనిచేస్తున్నాను.
బీజేపీ పార్టీలో నాతండ్రి సీనియర్ నాయకులు దుక్కేరి. జ్ఞానేశ్వరరావుగారు, సీనియర్ నాయకులు కూరసా. బొజ్జయ్య గారితో మా తండ్రి కలిసి బీజేపీ పార్టీ 1982 స్థాపించిన నాటి నుండి ఈరోజువరకు బీజేపీ పార్టీలోనే కొనసాగుతున్నరు. నిరంతరం బీజేపీ పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తున్నారు. మా తండ్రి దుక్కేరి. జ్ఞానేశ్వరరావు గారు బీజేపీ పార్టీలో పనిచేస్తూ ఎటువంటి అధికారంలో లేకున్నా ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు:
1. మా గ్రామానికి పేరు పెట్టింది మా తండ్రి గారే సిగినాపల్లి రామ్ నగర్ కోలనీ అని (అయోధ్య బాబీర్ మసీద్ ఉద్యమానికి వెళ్లి వచ్చాక).
2. మా గ్రామంలో ఉన్న ఇళ్లను అప్పటి మావోయిస్టు పరిస్థితి వలన ప్రజలపై మావోయిస్టు సానుభూతి పరుల నెపంతో ఇళ్లను పోలీస్ అగ్గితో కాల్చేయాటంతో ఆ నాటి MLA (MVVVS)మొట్టడం వీర వెంకట సత్యనారాయణ గ్రామ సమస్యను వివరించి పంచాయితీలో ప్రజలకు గ్రామంలో కూడా ఇల్లు పై కప్పు పెంకులను తెప్పించి గ్రామస్థులకు ఇళ్లను నిర్మాణం చేయించారు.
3. గ్రామానికి ప్రజలు రాకపోకలకు కాలిబాట మాత్రమే ఉండేది, అప్పటి అధికారులతో MLA లతో నిత్యం ఎన్నో నివేదికలు ఇచ్చి మాట్లాడి మట్టిరోడ్డు మంజూరు చేయించటం పనికి ఆహార పథకం ద్వారా జన్మభూమి అనే కార్యక్రమంతో మట్టి రోడ్డును వేపించారు.
4. గ్రామం మొత్తం దీపాలతో జీవనం గడుపుతున్న రోజుల్లో కరెంట్ స్తంబాలను రవణ సౌకర్యం లేకుంటే తన ఎద్దులతో గ్రామానికి తీసుకొచ్చి కరెంట్ వెలుగుల్ని ఇచ్చారు.
అంతే కాకా మా గ్రామంతో పాటు అనేక గ్రామాలకు అంగన్వాడీ సెంటర్స్ కోసం పోరాడి అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేయించారు. అలాగే గ్రామాల్లో పిల్లలకు స్కూల్స్ లేక ఇబ్బంది పడుతున్న సమయాల్లో గ్రామాల్లో కొద్దో గొప్ప ఐదవ తరగతి విద్య కల్గిన వాళ్ళను గుర్తించి తన సొంత డబ్బులతో ప్రభుత్వానికి సభ్యత్వం కట్టి మా బడి స్కూల్స్ ఏర్పాటు చేయించారు. ఇలా గ్రామా రైతుల వ్యవసాయానికి అనకట్టు నిర్మాణం, పిల్లలకు పై చదులు బయటకు తన సొంత డబ్బులు ఖర్చు చేసుకొని చదువు కోసం ప్రొచాహించటం ఇలా ఎన్నో కార్యక్రమాలు బీజేపీ పార్టీ ఇచ్చిన బాధ్యతతో ఏ అధికారం లేకున్నా ప్రజలకోసం బీజేపీ పార్టీ కోసం కాలినడకన పనిచేసిన వ్యక్తి మా తండ్రి గారు దుక్కేరి.జ్ఞానేశ్వరావు గారు. ఆరోజుల్లో గిరిజన ప్రాంతంలో గిరిజన గ్రామాల్లో రోడ్లు లేవు, ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్ళటానికి వాహనాలు లేవు, ఎక్కడకు వెళ్లాలన్న కాలినడకన ఎక్కని కొండ లేదు తిరగని గ్రామం లేదు బీజేపీ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ప్రతి గ్రామంలో బీజేపీ నూతన నాయకుల్ని కార్యకర్తల్ని తయారుచేస్తూ సభ్యతలు కట్టిస్తూ బీజేపీ పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేసి పంచాయితీ ప్రెసిడెంట్ గా, ఎం పి టీ సీ గా, జీకే వీధి మండల అధ్యక్షుడిగా, జడ్పీటీసీ గా నియోజకవర్గం అన్ని స్థానాలలో పోటీ చేసి బీజేపీ పార్టీని నడిపిస్తూ బీజేపీ పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఎంతోమంది గిరిజన నాయకుల్ని బీజేపీ పార్టీలోకి నడిపించిన నాయకుడు. అప్పటి బీజేపీ పార్టీ వ్యవస్థాపకుడు. మాజీ బీజేపీ ప్రధానమంత్రి అటల్ బీహార్ వాజ్ పేయి బీజేపీ పార్టీ అధిష్టానం పిలుపుతో గిరిజన ప్రాంతాల నుండి ప్రజలను ఢిల్లీకి మరియు అయోధ్యకు అనేకమందికి తీసుకెళ్లారు. అంతే కాకా ఆయన తుదిశ్వాస వరకు శ్రీరాముడులా ఒకే బాణం ఒకే మాటలా, తాను ఒకే పార్టీ బీజేపీ జెండానే మోస్తున్న వ్యక్తిగా నా తండ్రి దుక్కేరి జ్ఞానేశ్వరరావు గారి బాటలోనే పయనిస్తానని నా తండ్రే నాకు ఆదర్శంగా చేసుకొని తండ్రికి తగ్గ తనయుడిగా తన వెలిపట్టుకు నాడకా నేర్చిన కుమారుడిగా మీ దుక్కేరి. ప్రభాకరరావు. తల్లీ దండ్రుల ఆశయలు నెరవేరుస్తూ, గిరిజన ప్రాంతంలో బీజేపీ పార్టీ అధికారం కోసం పనిచేస్తూ తండ్రి సిద్ధాంతాన్ని గౌరవిస్తూ ఆచరిస్తూ ఆయన లాగే గిరిజన ప్రాంతా ప్రజల కష్టాలను తీరుస్తూ, బీజేపీ పార్టీ అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చిన చిత్తశుద్ధితో నిర్వహించి పనిచేస్తున్నాను.
గిరిజన ప్రాంతా ప్రస్తుత అభివృద్ధి పరిస్థితి:
భారతదేశానికి స్వాత్రంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొన్నా ఆ నాటి బ్రిటిష్ దొరల చేతుల్లో చిత్ర వాదాలు అనుభవించిన గిరిజన ప్రజల బ్రతుకులు ఆరోజు నుండి ఈరోజుకి మారలేదు మహాత్ముడు డా. బాబా సాహెబ్ అంబేద్కర్ నిమ్నజాతి గిరిజన ప్రజలకోసం ప్రత్యేక జి.ఓ లు భారతరాజ్యాగంలో ఐదవ షెడ్యూల్ లో చేర్చిన 1/70 చట్టాలు చేసిన పీసా చట్టాలు ఇలా అనేక గిరిజన హక్కులు కల్పనా జరిగిన గిరిజన ప్రాంతా ప్రజల బ్రతుకులు మారలేదు అవే ఆకలి కేకలు చీకటి బ్రతుకులు అంతే కాకా ప్రస్తుతం కేంద్ర బీజేపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతా ప్రజలకోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన అవి ప్రజలకు చేరటంలేదు ఈరోజుకి సరైన వైద్యం అందాక నాణ్యమైన విద్య దొరకక, చదువుకున్న విద్యార్థినీ విద్యార్థులు నిరుద్యోగులుగా మరి పశువుల కాపుకి వలస బ్రతుకులకే పరిమితమై కుటుంబ పోషణ భారమై రెక్కడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నారు. 77వ స్వాత్రంత్రం గడిచిన గిరిజన గ్రామాలకు తిరగడానికి సరైన రహదారి లేదు తల దాసుకోవటానికి సరైన ఇల్లు లేవు ఆరోగ్యంగా బ్రతకటానికి సురక్షిత మంచినీటి సదుపాయం లేదు రోగమొస్తే వైద్యం చేసే డాక్టర్లు లేరు సరిపడా వైద్య సదుపాయాలు లేవు. ఇంకా ఆర్థిక అభివృద్ధి ఊసే లేదు... గిరిజన అభివృద్ధి కోసం సరికొత్త ITDA లు పెట్టిన కోట్లలో నిధులు కేటాయించిన అభివృద్ధి శున్యం. గిరిజన ప్రజల కళ్ళముందే కాలం మారుతుంది. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి. ఎంతో మంది IAS IPS ప్రభుత్వ అధికారులు మారుతున్నారు కానీ గిరిజన ప్రజల బ్రతుకులు మారటం లేదు. దీనికి కారణం గిరిజన ప్రజల్లో చైతన్యం లేక గిరిజన ప్రజల కష్టాలను తీర్చే అధికారులు లేక సరైన గిరిజన నాయకుడు రాక. నా ఆవేదన... గిరిజన ప్రాంతా ప్రజల అభివృద్ధి కోసం గిరిజన ప్రజల కష్టాలను తీర్చటం కోసం గిరిజన బిడ్డగా నన్ను కన్నా అడవితల్లి ఋణం తీర్చుకోవటం కోసం బీజేపీ అధిష్టానం నాపై నమ్మకం ఉంచి ఒక్కసారి నాకు MLA టిక్కెట్ ఇస్తే నా గిరిజన ప్రజలకు సేవా చేసుకొంటాను. గిరిజన ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని నాకు నమ్మకం ఉందని దుక్కేరి.ప్రభాకరరావు బీజేపీ అరకు పార్లమెంట్ కిసాన్ మోర్చా ప్రధానకార్యదర్శి / ASR జిల్లా బీజేపీ పార్టీ సోషల్ మీడియా కన్వినర్ /జై ఆదివాసీ జై భీమ్ సంస్థ అధ్యక్షుడు/B2B ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ ఉత్తరాంధ్ర జిల్లాలా బ్యూరో చీఫ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలిపారు.