పిల్లలకు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ పార్టీ ఎంపీ ఆశవాహుడు డా. హేమ నాయక్.



జాతీయ ఆడపిల్లల దినోత్సవం సందర్బంగా అల్లూరి జిల్లా హుకుంపేట మండలం కె.జి.బి.వి.స్కూల్ మరియు కాలేజీ లో పిల్లలకు శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ పార్టీ ఎంపీ ఆశవహుడు డా. హేమ నాయక్.



ఆయన పిల్లలతో మాట్లాడుతూ ఆడపిల్లలు తలదించుకొని బ్రతికే రోజులు పోయాయిఅని, ఆడపిల్ల అంటే ఆధిపరా శక్తి అని, ఈతరం ఆడపిల్లలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రానిస్తున్నారని గుర్తుచేశారు.



అదే విదంగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లకు అన్నిరకాలు ప్రోత్సహం అందిస్తున్నాయని అవగాహన పరిచారు. అయితే గిరిజన ప్రాంత ఆడపిల్లలు మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధికి ఆమడదురంలోనే ఉండిపోతున్నారని ఆవేదన చెందారు.



అయినా మీరందరు అత్యున్నత స్థాయికి చేరుకోవటానికి మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని భరోసానిచ్చారు. అనంతరం మఠం గ్రామాన్ని సందర్శించి స్థానిక పసుపు పంట రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగితెలుసుకొన్నారు. తప్పకుండ కేంద్ర బీజేపీ మోడీ ప్రభుత్వం రైతులకు అన్ని రకాల సహకారం అందిస్తుందని బీజేపీ అంటేనే రైతుల ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నరు.