ముఖ్యమంత్రి సభకు కార్యకర్తలారా తరలిరండి: 41వ వార్డు సీనియర్ నాయకులు జె సి ఎస్ అర్బన్ క్లస్టర్ ఇంఛార్జి కోడిగుడ్ల శ్రీధర్
41వ వార్డు పరిధిలో ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, కన్వీనర్లు, గృహసారదులతో 41వ వార్డు సీనియర్ నాయకులు జె సి ఎస్ అర్బన్ క్లస్టర్ ఇంఛార్జి కోడిగుడ్ల శ్రీధర్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 27వ తారీఖున సంగివలసలో జరగనున్న వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశానికి కార్యకర్తలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. వార్డులో ఉదయం 10:30 గంటల నుంచే బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులందరూ స్వచ్చందంగా పాల్గొని కార్యక్రమం జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు వర్కింగ్ ప్రెసిడెంట్ వి. వెలంగిని రావు, దేవి, ఈశ్వరి, బబ్లూ సాయి, శ్యామ్ సుందర్, రమేష్, ఆనంద్, కళ్యాణ్, ప్రభాథ్, కుమార్, రజాన శ్రిను తదితరులు పాల్గొన్నారు.