కాంగ్రెస్ పార్టీ వలన గిరిజనులకు మేలు జరుగుతుంది

కాంగ్రెస్ పార్టీ వలన గిరిజనులకు మేలు జరుగుతుంది: ఆదివాసి కాంగ్రెస్ డుంబ్రిగూడమండల అధ్యక్షుడు కిల్లో జగన్నాథం.



అరకు వేలి నియోజకవర్గం డుంబ్రిగూడ  27.01.2024న ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర చైర్ పర్సన్ మరియు అరకు వేలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి శ్రీమతి పాచి పెంట శాంతకుమారి ఆదేశాల మేరకు డుంబ్రిగూడ మండలము అరమ పంచాయతీ అరుమ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆదివాసి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కిల్లో జగన్నాథం పర్యటించి గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ కోసం గతంలో ఇందిరమ్మ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లులు పోడు పట్టాలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గిరిజనులకు అనేక హక్కులు, చట్టాలు తదితర పథకాల కోసం వివరించడం జరిగింది. గిరిజనులకు ఒక కాంగ్రెస్ పార్టీతోనే గిరిజనుల హక్కులు చట్టాలు మేలు జరుగుతుందని రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కిల్లో రాజు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.