శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వాడవాడల అయోధ్య శ్రీరాముని అక్షింతల పంపిణీ
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుండి వచ్చిన అక్షింతలు, ఆహ్వాన పత్రికల పంపిణీ: కోలా ఆనంద్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ కన్వీనర్
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు సూచనల మేరకు 20- 01- 2024 తేదీన ఉదయం 11.00 గంటలకు శ్రీకాళహస్తి పట్టణం నందు స్థానిక కొత్తపేట, కైకాల వీధిలో శ్రీ కోలా ఆనంద్ కుమార గారి నేతృత్వంలో ఇంటింటికి అక్షింతలను, ఆహ్వాన పత్రికలను భక్తి శ్రద్ధలతో బీజేపీ కార్యకర్తలతో కలసి అక్షింతలు, అయోధ్యా శ్రీరామ ఆలయ ప్రతిమలను పంపిణీ చేయడం జరిగినది. దానికి ముందు స్థానిక గాంధీ వీధిలోని "శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి జ్ఞాన వినాయక స్వామి" వారి ఆలయంలో అయోధ్య నుంచి ట్రస్ట్ ద్వారా పంపిన ఆహ్వాన పత్రికలు, అక్షింతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రతి కుటుంబానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో కలిసి అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్ ఘనంగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా ప్రతి ఇంటి నుంచి మహిళలు భక్తిశ్రద్ధలతో అక్షింతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ భక్తులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, వివిధ సంఘాల సభ్యులు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి, అసెంబ్లీ కన్వీనర్ కోలా ఆనంద్ కుమార్, జిల్లా సెక్రటరీ, అసెంబ్లీ కో - కన్వీనర్ మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్, రాష్ట్ర ఓబీసీమోర్ఛా సభ్యులు ఎస్వీ రమణ, జిల్లా అధికార ప్రతినిధి అమ్మపాలెం రమణా రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు పగడాల ప్రతాప్, పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి అయ్యప్ప, సీనియర్ నేతలు జీ.వి. అమర్నాధ్, కన్నా వెంకటేశ్వర్లు, యువమోర్చా నేతలు తానికొండ్ల భరత్ నాయుడు, సజ్జ హరీష్, కటికం చెందు, నాని, అబ్దుల్లా, మురళి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.