ఘనంగా డిసిసిబి చైర్మన్ నరసింహరాజు జన్మదిన వేడుకలు...శుభాకాంక్షలు తెలిపిన బలరాముడు...
ఉండి: డిసిసిబి చైర్మన్, ఉండి నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పివియల్ నరసింహరాజు జన్మదిన వేడుకలు పెదఅమిరంలోని వైకాపా పార్టీ కార్యాలయం నందు శనివారం ఘనంగా జరిగాయి. పలువురు సీనియర్ నేతలతోపాటు ఉండి నియోజకవర్గ బీసీ సంఘం సోషల్ మీడియా కన్వీనర్, తమ్మినేని యువసేన ప్రతినిధి అరివెల్లి బలరాముడు పివియల్ నరసింహరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. పూలదండ వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. వచ్చే సంవత్సరం మీ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే మంత్రి హోదాలో మనమంతా చేసుకోవాలని నరసింహరాజును బలరాముడు కొనియాడారు.