రాజాం పట్టణాన్ని సుందరీకరణ చేసి జిల్లాలోనే రెండో వాణిద్య కేంద్రంగా తీర్చిదిద్దుతాం

రాజాం పట్టణాన్ని సుందరీకరణ చేసి జిల్లాలోనే రెండో వాణిద్య కేంద్రంగా తీర్చిదిద్దుతాం...దేశంలోనే 3 వేల రూపాయల పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్..జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) 



రాజాం ఆర్టీసీ బస్సు కాంప్లెక్స్ వద్ద వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్న  విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను), శాసనమండలి సభ్యులు మరియు ప్రభుత్వ విప్ శ్రీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ తలే రాజేష్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కు రాసిన సందేశాన్ని చదివి వినిపించి వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్యక్రమంలో భాగంగా 2,750 నుంచి 3000 పెన్షన్ పెంచిన మొత్తాన్ని వారికి అందజేశారు. అనంతరం టిడిపి జనసేన పార్టీల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.



ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జడ్పీ వైస్ చైర్మన్ సిరిపురం జగన్ మోహన్ రావు, ఎంపీపీ ప్రతినిధి లావేటి రాజగోపాల్, జడ్పిటిసి బండి నరసింహులు, వైస్ ఎంపీపీలు వెంకటేష్, వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీను, మండలంలో గల సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధికారులు పాల్గొన్నారు.