ఆడుదాం ఆంధ్రా…ఇది అందరి ఆట కబడ్డీ ఫిమేల్ టీం విన్నర్ కు అభినందనలు తెలిపిన సర్పంచ్ కాయ దమయంతి
ఇచ్చాపురం: నియోజకవర్గం స్థాయిలో ఈరోజు జరిగిన ఆడుదాం ఆంధ్ర పోటీలో కవిటి మండలం కు చెందిన పెద్ద కపాసకుద్ది గ్రామ కబడ్డీ ఫిమేల్ టీం విన్నర్ గా నిలిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయ దమయంతి భీమసేను, పంచాయతీ కార్యదర్శి రూప, డిజిటల్ సతీష్, పిఈటి ఈశ్వరరావు, కోచ్ బైపిల్లి నరేంద్ర, గ్రామ పెద్దలు, వాలంటరీస్, గ్రామ యూత్ అందరు అభినందించారు. త్వరలో ఇచ్చాపురం నియోజకవర్గం తరుపున సెలెక్ట్ అయ్యి జిల్లా స్థాయి అటల పోటీల్లో శ్రీకాకుళం వెళ్లి ఆడానున్నారు.