మర్రి పుట్టు గ్రామానికి రోడ్డు సదుపాయం ఎప్పుడు?

అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మర్రి పుట్టు గ్రామంలో రోడ్డు సదుపాయం లేక గ్రామస్తులు నరక యాతన అనుభవిస్తున్నారు. గురువారం గుత్తుల పుట్టు సంతా బయలులో జరిగే సంతలో ఇదే ప్రధాన మార్గం. రోడ్డు సదుపాయం సరిగా లేక సుమారు 50 గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 



ఇక్కడ బ్రిడ్జి పూర్తిగా కూలిపోయింది, అయినా పట్టించుకునే నాధులు కరువయ్యారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. ఓట్లు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు సమస్యలు పట్టించుకోకపోతే ఇంకెవరి పట్టించుకుంటారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు మంజూరు చేస్తారని గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు.