వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండి మండల కమిటీ ఉపాధ్యక్షులుగా గెద్ధా భోగేశ్వరరావ్....
అభినందనలు తెలిపిన పలువురు పార్టీ నేతలు...
ఉండి: కష్టపడిన ప్రతీ ఒక్కరికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉంటుందని అనడంలో సందేహం లేదు, అందులో భాగంగా వైఎస్సార్సీపీ ఉండి మండల కమిటీ ఉపాధ్యక్షులుగా గెద్దా భోగేశ్వరరావును ఉండి నియోజక వర్గ ఇంచార్జీ, డిసిసిబి చైర్మన్ పివియల్ నరసింహరాజు నియమించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరుపేదల పార్టీ అని మరొక్కసారి ఋజువైందని, ఎప్పటికప్పుడు తాను బడుగు బలహీన వర్గాల కోసమే ఉన్నానని సీఎం జగన్మోహన్ రెడ్డి పలుమార్లు నిరూపించుకుంటూనే ఉన్నారని భోగేశ్వరారావ్ అన్నారు. పేదాల ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించి తీరుతామని ఆయన అన్నారు. ఆయనకు ఇంతటి మంచి అవకాశాన్ని కల్పించిన నరసింహరాజుకు భోగేశ్వరరావ్ ధన్యవాదాలు తెలియచేశారు. అనంతరం ఓ ప్రకటనలో పార్టీ మండల అధ్యక్షులు పివిఆర్కే ఆంజనేయరాజు, బీసీ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు సూరవరపు వెంకటాచార్యులు, వైఎస్సార్సీపీ ఉండి ప్రధాన కార్యదర్శి గలవిళ్లి ధనుంజయ, నాయకులు మున్నలూరి శ్రీనివాస్, ఉండి నియోజక వర్గ బీసీ సంఘం సోషల్ మీడియా కన్వీనర్ అరివెల్లి బలరాముడు, బాలం తులసితో పాటు పలువురు నేతలు భోగేశ్వరరావుకు అభినందనలు తెలిపారు.