అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరు సబ్ డివిజన్, చింతూరు మండలం, చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టి గ్రామపంచాయతీ వీరాపురం గ్రామ శివారు ప్రాంతంలోని ఎన్ హెచ్ 30 వద్ద మావోయిస్టు సానుభూతిపరులు నక్క దావీదు, విజయ్ విశ్వాస్, అని ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను చింతూరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
అరెస్ట్ కాబడిన వారి వివరములు
1. నక్క దావీదు అలియాస్ డేవిడ్ రాజు తండ్రి పండయ్య (లేటు), వయస్సు 55 సంవత్సరములు, కులం మాల, అనంతపల్లి గ్రామం, కలెమెల బ్లాక్, మల్కానగిరి జిల్లా, ఒడిస్సా రాష్ట్రం.
2. విజయ్ విశ్వాస్ తండ్రి భీమాల్ విశ్వాస్, వయసు 32 సంవత్సరాలు, కులం బెంగాలీ, పట్నం పార, సుకుమా జిల్లా, చతిస్గడ్ రాష్ట్రం.
పట్టుబడిన విధానం
పోలీసులకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు ఈరోజు అనగా 21-02-2024 ఉదయం 10 గంటలకు చట్టి పంచాయతీ పిఠాపురం గ్రామ శివారు ప్రాంత జాతీయ రహదారి 30 వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా చట్టి గ్రామం వైపు నుండి వస్తున్న సిజి26ఈ 8915 హీరో మ్యాజిస్ట్రో 125 ఎడ్జ్ (స్కూటీ) నెంబర్ గల వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసు వాహన తనిఖీని గమనించి వారి వాహనమును వెనక్కి తిప్పి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని పట్టుకుని వారి వద్ద ఉన్న సంచిని పరిశీలించగా అందులో విస్పోటనం కి ఉపయోగించే పేలుడు పదార్థాలు ఉన్నవి. అంతటా వారిని అదుపులోకి తీసుకొని విచారించగా సదరు పేలుడు పదార్థాలు మావోయిస్టు పార్టీకి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
మీరు గతంలో 2023 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఒకసారి మరియు అక్టోబర్ నెలలో మరోసారి తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో ఖమ్మం పరిసర ప్రాంతం నుండి పేలుడు పదార్థాలను కొనుగోలు చేసి చత్తీస్గడ్ రాష్ట్రంలోని మావోయిస్టు పార్టీకి సరఫరా చేసినట్లు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు
01. డిటో నేటర్స్ - 95
02. ప్యుజ్ వైరు - 15 మీటర్లు
03. జిలిటన్ స్టిక్స్ - 190
04. మావోయిస్టులు రాసి ఇచ్చిన చీటీ సరుకుల కోసం
05. నగదు రూపాయలు 13000.
06. ద్విచక్ర వాహనం (స్కూటీ)
నిషేధిత మావోయిస్టు పార్టీకి ఎవరైనా సహకరించి సంఘవిద్రోహ చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే వెంటనే పోలీసులకు తెలియపరచాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్., ఆదేశాల మేరకు కెవి మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్., అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) రంపచోడవరం వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో 42 బెటాలియన్ ఈ కంపెనీ సిఆర్పిఎఫ్ ఇంచార్జి ఓసి మోతిలాల్ శెని, ఎం గజేంద్ర కుమార్ ఇన్స్పెక్టర్ చింతూరు సర్కిల్, డి శ్రీనివాసరావు సబ్ ఇన్స్పెక్టర్ చింతూరు పోలీస్ స్టేషన్, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.