కవితను మరో 5 రోజుల కస్టడీ

ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ నాయకురాలు కవితకు ఢిల్లీ కోర్టు ఈడీ రిమాండ్‌ను మార్చి 26 వరకు పొడిగించింది.



కవితను మరో 5 రోజుల కస్టడీకి ఇడి కోరింది. గతంలో ఆమెకు 7 రోజుల ఈడీ కస్టడీ విధించింది. మనీలాండరింగ్ కేసులో కే కవితకు మరో మూడు రోజుల పాటు ఈడీ రిమాండ్ పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 26న ఉదయం 11 గంటలకు కవితను కోర్టులో హాజరుపరచనున్నారు.