పోలియో రహిత సమాజం దిశగా అడుగులు

పోలియో రహిత సమాజం దిశగా సీలేరులో పోలియో ఆదివారం



3-3-2024 తేదీన పల్స్ పోలియోకార్యక్రమును డా. SK మస్తాన్ వలీ అధ్యక్షతన డా.K. సౌమ్య వైధ్యాధికారుల పర్యవేక్షణ లోజరిగినది. ప్రజా ప్రతినిదులు, అధికారులు, మహిళా సంఘాలు, సచివాలయం సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మరియు ఆరోగ్య సిబ్బంది సమన్వయం తో ప్రణాళికా బద్దంగా నిర్వహించినారు. అన్ని బూత్ లకు శిక్షణ పొందిన సిబ్బంది తో అంకితభావం తో విజయవంతం చేసినారు. మొబైల్ టీమ్, ట్రాన్సిట్ టీమ్ లు లోతట్టు ప్రాంతాలు, నాలుగు రోడ్ల కూడలిలో సమర్థవంతంగా, నిశితంగా పరిశీలించి భద్రాచలం నుండి దారకొండ పుణ్య క్షేత్రానికి వాహనం లోవెల్లే యాత్రికులలో పిల్లలకు పోలియో చుక్కలు వేసి గ్రామ ప్రజల మన్ననలు పొందారు.



టార్గెట్ చిల్డ్రన్ 962 కు గానూ 1012 మంది పిల్లలను అదిగమించి 105% సాధించడం జరిగింది. సదరు కార్య క్రమం లో MPHEO జోజి బాబు, HS త్రినాధరావు, HV బాలామని మరియు MPHA సత్యన్నారాయణ  పాల్గొన్నారు