బిజెపి ,- జనసేన మద్దతుతో ఖమ్మం లోక్ సభ బరిలో టిడిపి,?
ఇప్పటికే ఎన్ డి ఏ లో తెదేపా....అమిత్ షా తో బాబు సమాలోచన.....గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.....రాష్ట్రవ్యాప్తంగా ఓటు బదిలీపై ఆశాభావం.....ధ్రువీకరించని తెలంగాణ బిజెపి......బగ్గు మంటున్న నేతలు.....
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న పట్టుదలతో ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యూహం సిద్ధం చేసినట్లు అత్యంత విశ్వాసనీయ వర్గాలు చెబుతున్నాయి. బిజెపి. జనసేన పొత్తుతో తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో పోటీకి తెలుగుదేశం పార్టీ సమావేశం అయినట్టు చెబుతున్నారు ఖమ్మంలోక్సభ స్థానంలో బిజెపి జనసేన సహకారంతో పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టాలన్న నిర్ణయానికి టిడిపి వచ్చినట్టు సమాచారం