కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజవర్గం పెద్దకడబూరు మండల పరిధిలోని, మేకడోన నౌలేకల్ గ్రామాల మధ్య ఎల్సి కాల్వ దగ్గర ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని పెద్ద తుంబలం గ్రామానికి చెందిన బసవరాజు 32 అనే వ్యక్తి బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
నౌలేకల్ గ్రామంలో బుధవారం బంగారం అవ్వ దేవర మహోత్సవం సందర్భంగా ఎల్ఎల్సీ వెంబడి రహదారిలో రద్దీ ఎక్కువగా ఉంది రహదారిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనడంతో బసవరాజు కు తలకు తీవ్ర గాయాలయ్యాయి దిశ కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో ని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.