మహిళా దినోత్సవం విజయవంతంకై ప్రచారం ఉత్తరాంధ్ర మహిళా సంఘం
శ్రీకాకుళం:- శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, బొడ్డపాడుగ్రామంలో మార్చ్ 8 శ్రామిక మహిళా దినోత్సవ స్ఫూర్తిని కొనసాగిస్తామంటూ ఉత్తరాంధ్ర మహిళా సంఘం కరపత్రం ఆవిష్కరణ చేసింది. మండలంలోని గ్రామాలలో మహిళా దినోత్సవం విజయవంతంకై ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా ఈ సంఘం నేపథ్యం గురించి చెప్తున్నారు. సంఘంలో ఉన్న మహిళలంతా బాధితులే. మా లాంటి బాధితులను ఆత్మ గౌరవంగా నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో, అతి ప్రాథమిక జ్ఞానంతో ఈ సంఘాన్ని ప్రకటించుకున్నమని చెప్తున్నారు. ఈ కొద్ది కాలంలోనే స్త్రీల పట్ల అనేక విషయాల్లో దృఢంగా నిలబడి పనిచేశారు.
మరింత బాధ్యతగా మనుముందు పనిచేస్తామని ఈ కరపత్రం ద్వారా ఉత్తరాంధ్ర మహిళా సంఘం తెలియజేసింది. ముఖ్యంగా స్త్రీలకు న్యాయం దొరకడం ఈ సమాజంలో చాలా కష్టతరమైన పనిని న్యాయం విషయంలో కోర్టులు, చట్టాలు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కూడా డబ్బు అధికారంకి ప్రభావితమే ఉన్నాయన్నారు. ఈ ప్రభావంతో స్త్రీలకు ఎక్కడ న్యాయం దొరకట్లేదని ఆవేదన చెందారు. ముఖ్యంగా ఒక ఎఫైర్ నమోదు కోసమే పెద్ద ఎత్తున పోరాటం చేస్తే గాని ఎఫ్ఐఆర్లు నమోదు కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ఈ సంఘం తెలియజేసింది. అలానే బాధితులైన మహిళలు సమస్యలు వస్తున్నప్పుడు పెద్ద ఎత్తున పితృస్వామ్య ద్వారా కులాహంకారులచేత, పెద్దమనుషులమని చెప్పుకునే పితృస్వామ్య ధోరణి కలిగిన వ్యక్తులు చేత తీవ్రమైన స్క్రోలింగ్ కు మహిళలు గురవుతున్నారు.
ఇది చాలా ప్రమాదకరమైన అంశం. సత్యాన్ని నిట్టనిలువునా పాత్ర వేస్తూ, అబద్ధాన్ని అతివేగంగా ప్రచారం చేస్తూ, వాళ్ళ నైతికతను, ధైర్యాన్ని, విలువలను, వ్యక్తిత్వాన్ని చంపే ఆయుధమే ఈ ట్రోలింగ్ అని సంఘం గట్టిగా నొక్కి వక్కాణించి చెప్పింది. అయితే ఇది ఒక సాధారణ సమస్య కాదని, ఇది సామాజిక సమస్యగా గుర్తించాలని, దీనిపైన విస్తృతమైన చర్చ, నిరసన తెలియజేయాలని బుద్ధిజీవులకు, ప్రజాసంఘవాదులకు, మహిళా సంఘాలకు, యువజన సంఘాలకు ఈ సంఘం విజ్ఞప్తి చేసింది. అలానే మార్చ్ 8తో పాటు ఎన్నికలు సమీపిస్తున్న ఈ సమయంలో ప్రజల ముందుకు వస్తున్న అన్ని పార్టీలను మద్య నిషేధంపై ప్రశ్నించాలని వాళ్ల మ్యానిఫెస్టోలో ఈ విషయాన్ని స్పష్టమైన హామీని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఒకపక్క అధికార ప్రభుత్వం మద్య నిషేధం అమలు చేస్తానని మాటిచ్చి, అధికారంలోకి వచ్చి మాటను నిలబెట్టుకోలేకపోయింది. ఈరోజు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. అదే స్థాయిలో నాటు సారావలన అనేకమంది చనిపోతున్నారు. ఇట్లాంటి సంఘటన వల్ల వందలాది మంది మహిళలు ఒంటరి మహిళలుగా ఈ సమాజంలో మిగిలిపోతున్నారు. పై పరిస్థితిపై ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించకుండా, నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పడం చాలా దౌర్భాగ్యకరమైన పరిస్థితి.
ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 76 ఏళ్లైనా నాణ్యమైన నీరు ఇవ్వలేని ఈ పాలకవర్గాలు నాణ్యమైన మద్యం అందిస్తానని చెప్పడం ప్రజలపైన వీళ్లకు ఉండే బాధ్యత ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన సమాజంపై పోరాడదామని మద్యనిషేధంకై పోరాడదామని ఉత్తరాంధ్ర మహిళా సంఘం పిలుపునిచ్చింది. ఈ ఆవిష్కరణలో పి.నాగమణి, యు. జ్యోతి, ఆదిలక్ష్మి, వెంకటమ్మ, పి.భాను తదితరులు పాల్గొన్నారు.