రహదారిలో బైక్ ప్రమాదం.. యువకుడు మృతి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజవర్గం నందవరం మండలం, నాగలదిన్నే, గ్రామం దగ్గర రహదారిలో బైక్ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. వివరాలలోకి వెళితే ఎమ్మిగనూరు పట్టణం లోని శివన్న నగర్ ప్రాంతానికి చెందిన రవి ప్రకాష్ (21) మరియు లక్షింపేట కు చెందిన గణేష్ (22) ఇద్దరు పని నిమిత్తం నాగలదిన్నే కు వెళ్లి వస్తుండగా తిరుగు ప్రయాణంలో మద్యం సేవించి అతి వేగంగా బైకు పై వస్తుండగా ఎదురుగా వస్తున్న వాహనం యొక్క లైట్లు కళ్ళకు పడటంతో రోడ్డు కనిపించక పోయేసరికి బైకు అదుపుతప్పి క్రింద పడటంతో రవి ప్రకాష్ ముఖంకు మరియు తలకు బలమైన గాయాలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని వైద్యులు తెలిపారు.