పోలీసుల అదుపులో ఏఎస్పీ భుజంగరావు

ఫోన్  ట్యాపింగ్ కేసు: పోలీసుల అదుపులో ఏఎస్పీ భుజంగరావు 



హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. భూపాలపల్లి ఏఎస్పీగా ఉన్న భుజంగరావు.. గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్‌లో పనిచేశారు. రేపు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పర్చునున్నారు. ప్రణీత్ రావును, భుజంగరావును శనివారం పోలీసులు ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ పోలీసులు.. భుజంగరావు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్రావును ఇప్పటికే ఆరు రోజుల పాటు పోలీసులు విచారించారు. రేపు( ఆదివారం) మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచే అవకాశం ఉ‍న్నట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఎస్‌ఐబీలో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుల్స్‌ను పిలిచి విచారించారు. మరోవైపు ఎస్‌ఐబీలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో స్పెషల్ టీమ్ ముందు హాజరయ్యారు. వీరితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్‌ఐబీలో పని చేసిన వాళ్లందరినీ విచారించే అవకాశం ఉ‍న్నట్లు తెలుస్తోంది..