ప్రచారం లో దూసుకుపోతున్న ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక

ఎమ్మిగనూరు పట్టణం లోని బంగి ప్రమీల గారి 20 వార్డ్ లో కోట ఈశ్వర స్వామి దేవాలయం దగ్గర నుండి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారి ప్రచారం మొదలుపెట్టారు ప్రచారం లో బాగంగా బుట్టా రేణుక గారు ప్రతి ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ జగనన్న చేసిన సంక్షేమలను వివరిస్తూ మళ్ళీ జగనన్నను గెలిపించుకోవాలని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పడం జరిగింది.



జగనన్న ప్రతి పిల్లవాడికి మామ గా,ప్రతి తల్లి కి ఇంటి పెద్ద కొడుకు లా,ప్రతి అవ్వకు మనవడిల,అందరినీ ఆదరిస్తూ అందరికి సమాన పాలనను అందిస్తున్నారు అని ప్రతి గడపకు తనదైన శైలిలో వివరిస్తూ జగనన్నను గేలిపించుకోవలని మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ఆశీర్వదించలని ప్రతి గడపకు వెళ్ళి ప్రచారం లో బాగంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ బంగి ప్రమీల, వార్డుఇంచార్జ్ బంగి శ్రీరామ్, వార్డులు నాయకులు యు యు నగేష్, కర్ణ, వీరేశ్, మల్లి, హరి, నవీన్, లోకేష్, పట్టణ అధ్యక్షులు బుట్టా రంగయ్య, టౌన్ బ్యాంక్ చెర్మెన్ యు కె రాజశేఖర్, పట్టణ అధికార ప్రతినిధి సునిల్ కుమార్, కౌన్సిలర్లు, రాజరత్నం, అమాన్, శివప్రసాద్ పాల్గొన్నారు.