ప్రజా పరిచయ యాత్రలో దూసుకుపోతున్న నాగమణి
బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
ప్రజా పరిచయ యాత్ర చేస్తున్న విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్దైన నాగమణి కి రోజు, రోజు కి ప్రజాదరణ పెరుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి కాదు. మాస్టర్ డిగ్రీ వరకు చదువుకున్న ఈమె భీమిలి నియోజకవర్గం లో పుట్టి పెరిగిన మహిళ. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకున్న ధరణి. మొదట్లో ఓకే ఒక్కరై ప్రజా పరిచయ యాత్రకు బయలుదేరిన ఆమెకు నేడు వందల,వేల సంఖ్యలో ప్రజలు అభిమానులయ్యారు. ప్రజా పరిచయ యాత్రకు వెళ్లిన నాగమణికి ప్రజలు హృదయపూర్వకమైన స్వాగతం పలుకుతున్నారు. ఆ నియోజకవర్గంలో అతిరథ మహారధులు పోటీ చేస్తున్నప్పటికీ వెనుకంజ వేయకుండా మండు టెండల్లో ఎంతో దిగ్విజయంగా ముందుకు సాగుతున్నారు. ఓటమి, గెలుపు లనేది ప్రజల నిర్ణయమని తుది వరకు తన ప్రయత్నం తాను చేస్తూ ఎల్లప్పుడూ ప్రజాసేవలో అందరికంటే ముందుంటానంటున్నారు. ప్రతిరోజు కొన్ని వార్డులు పర్యటిస్తూ వారందరి సంక్షేమం తెలుసుకుంటూ పరిష్కారానికి ముఖ్యపాత్ర పోషిస్తానని హామీ ఇస్తున్నారు. ఇచ్చిన మాట తప్పకుండా ఉండే శక్తి విజయవంతురాలైన నాగమణికే ఉందని చెప్పుకోవచ్చు. నాగోతి నాగమణి ఈ రోజు ప్రజా పరిచయ కార్యక్రమం లో భాగంగా భీమిలి నియోజకవర్గం అయినటువంటి మధురవాడ లో గల పోతిన మల్లయ్య పాలెం, R H Colony, లక్ష్మి వాని పాలెం చుట్టుపక్కల ప్రాంతాలలో ప్రజా పరిచయ కార్యక్రమం లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముగించనున్నారు. వలస పక్షులను కాకుండా భీమిలి నియోజకవర్గ ముద్దుబిడ్డ, స్వతంత్ర అభ్యర్డైన నాగోతి నాగమణికి ఒక్కసారి ప్రజలకు, నియోజకవర్గానికి ప్రత్యక్ష సేవ చేసే మహాభాగ్యాన్ని కల్పిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి "అభివృద్ధి కి చిరునామా" గా మార్చి, అన్ని మౌలిక వసతులు కల్పించడమే కాకుండా అన్ని వర్గాల వారికి అన్ని సంక్షేమ పథకాలు చేరవేయడంలో తన వంతు ముఖ్య పాత్ర పోషించడంలో తనకు తానే సాటిగా నితుపించుకుంటాను అన్నారు. అందుకే ప్రజా దేవుళ్ళు అందరూ పార్టీలకతీతంగా ముందుకు వచ్చి తమ సంపూర్ణ మద్దతు నందించి నాగమణి ని ఆశీర్వదించాలని కోరుకుందాం.