గ్రామంలో ఘనంగా మహిళా దినోత్సవం....

ఈదుల పుట్టు గ్రామంలో మ్యాజిక్ బస్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం.... 


అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం ఈదులపుట్టు గ్రామంలో మ్యాజిక్ బస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మ్యాజిక్ బస్ లైట్ స్కిల్ ఎడ్యుకేటర్ పాంగి పద్మావతి పాల్గొని గ్రామస్తులకు మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అందరూ చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఈదుల పుట్టు గ్రామస్తులు మరియు యువత పాల్గొన్నారు.