దళితులు గిరిజనులను డమ్మీలుగా వాడుకుంటున్నారు

దళితులు గిరిజనులను డమ్మీలుగా వాడుకుంటున్నారు



సీలేరు ఏపీ జెన్కో ప్రాజెక్టులో దళితులు ఎక్కువమంది కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి SC/ST పేరుతో గిరిజనులను డమ్మీలుగా వాడుకుంటూ దళిత కాంట్రాక్టర్లు లబ్ది పొందుతున్నారని కొమరం భీమ్ సొసైటీ అధ్యక్షులు కిల్లో మనోజ్ కుమార్ ధ్వజమెత్తారు, షెడ్యూల్ ప్రాంతంలో గిరిజన సంఘాలు మరియు సొసైటీలకు కాంట్రాక్ట్ పనులు నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని ప్రభుత్వ GO NO: 90 మరియు 30 ఉందని అయినా వాటిని ఇక్కడ అమలు చేయడం లేదు గతంలో ITDA ప్రాజెక్ట్ అధికారి వారు చొరవతో జంగిల్ పనులను ST లకు రిజర్వ్ చేయగా కాంట్రాక్టు పనులో రిజర్వేషన్ ఏంటని హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న దళిత కాంట్రాక్టర్లు సామాజిక న్యాయం కోసం SC/ST పేరుతో రిజర్వేషన్ గా మార్చి అమాయక గిరిజనులను మోసం చేస్తూ కేవలం దళిత కాంట్రాక్టర్లు మాత్రమే లబ్ది పొందుతున్నారని వారికి దళిత అధికారులు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన తెలిపారు, అదేవిధంగా కాంట్రాక్ట్ పనులు చేస్తున్న వారికే మళ్లీమళ్లీ పనులు ఇస్తూ మిగతా వారికి మొండిచేయి చూపించడం చాలా దారుణమని తెలిపారు, ఇదొక పెద్ద మాఫియాలా తయారైందని వీటిపై పూర్తి విచారణ జరపాలని ఇక్కడ దళిత అధికారులు కమిషన్కు కక్కుర్తిపడి దొంగ దారిలో దళిత కాంట్రాక్టర్లకు పనులు కేటాయిస్తూ గిరిజన కాంట్రాక్టర్లకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఈ విషయాలు గురించి పై ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు, ఈ కార్యక్రమంలో కొమరం భీమ్ ఎస్టి మ్యూచువల్లీ ఎయిడెడ్ లేబర్ కాంట్రాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంఘ సభ్యులు మరియు గిరిజన కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.