చట్టసభలలో ఆదివాసుల ప్రాతినిధ్యం తగ్గించి ఏజెన్సీలో వనరుల దోపిడి బిజెపి లక్ష్యం
దొంగ ఎస్టి కొత్తపల్లి గీత అభ్యర్థిత్వన్ని నిరసిస్తూ ఆదివాసులంత బిజెపి నుండి బయటికి రావాలి..
గీతా ఓటమికి పార్టీలకు అతీతంగా కృషి చేయాలి ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్సార్ జిల్లా కన్వీనర్ రామారావు దొర పిలుపు....
అల్లూరి సీతారామరాజు జిల్లా: బిజెపి చట్టసభలలో ఆదివాసుల ప్రాతినిధ్యం లేకుండా చేసి ఏజెన్సీలోని వనరుల దోపిడీకి పాల్పడాలని చూస్తుందని, అందుకే కులావివాదం ఎదుర్కొంటున్నా కొత్తపల్లి గీతకు అరుకు ఎస్టి పార్లమెంటు నియోజకవర్గం కట్టబెట్టిందని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ అల్లూరి జిల్లా కన్వీనర్ రామారావు దొర బిజెపి తీరుపై మండిపడ్డారు. కుల వివాదం ఎదుర్కొంటు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 42 కోట్ల రూపాయలు తోకరావేసి ఆర్థిక నేరం కింద జైలుకు వెళ్లిన గీతకు ఆరుకు పార్లమెంట్ టిక్కెట్టు కట్టబెట్టిడాన్ని ఆదివాసీ జెఎసి తీవ్రంగా వ్యతిరేకించింది. గీతా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ కుమార్ గారికి లేఖలు రసమని,ఆదివాసుల అంత ముక్తకంఠంతో వ్యతిరేకించిన, బిజెపి తన వద్ద ఉన్న డబ్బు, పలుకుబడికి లొంగి ఆ రాష్ట్రంలో ఒక్కగానొక్క అరకు ఎస్టీ రిజర్వుడ్ సీటును దొంగకు అప్పాజెప్పారని, బిజెపి, జనసేన, టిడిపి కూటమిని ఓడించకపోతే చట్టాసభలలో ఆదివాసుల ప్రాతినిధ్యం లేకుండా చేసి బోయవాల్మీకి, బెంతో ఒరియా కులాలతో పాటు మరిన్ని కులాలను కూడా ఎస్టీ జాబితాలో చేర్చుతారని రామారావు దొర ఆవేదన వ్యక్తం చేసారు. ఆదివాసి మహిళను రాష్ట్రపతిని చేసి ఆదివాసులకు ఎంతో చేసామని ప్రపంచన్ని నమ్మించిన బిజెపి నూతన అటవీ సంరక్షణ సవరణ చట్టం -2023 ద్వారా గ్రామ సభ అధికారులను తొలగించిందని, భారతీయ జనతా పార్టీ ఆదివాసులకు వ్యతిరేకంగా పనిచేస్తుందనడానికి ఇంతకంటే రుజువులు కావాలా? అని జేఏసీ బిజెపిని ప్రశ్నించింది. ఆంధ్రప్రదేశ్లో జర్రెల, ఒరిస్సాలో నీయంగిరి వద్ద వేదాంత కంపెనీ బాక్సైట్ కార్యకలపాలను గ్రామసభ తీర్మానాల ద్వారా అడ్డుకున్నామని, బిజెపి ప్రభుత్వం ఆ నియమాలను తొలగించిందని అన్నారు. ఎన్నికల తరువాత కొత్తపల్లి గీత లాంటి బోగస్ ఎస్టీలను మధ్యలో పెట్టి మైనింగ్ కార్యకలాపాలు మొదలుపెడతారని, ఆదివాసులు ఇప్పటికైనా పార్టీల మోజులోపడి తమ హక్కుల కోల్పోవద్దని, కూటమి ఓటమి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని దొర విజ్ఞప్తి చేశారు. కొత్తపల్లి గీత వ్యవహారం మొదటిది కాదని, ప్రతి ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారని, కొత్తపల్లి గీత, వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, శోభ హైమావతి దేవి, శత్రుచర్ల విజయరామరాజు వంటి కులావివాదాలు ఎదుర్కొంటున్న వారు కొందరైతే, కుంభ రవిబాబు వంటి ఏజెన్సీ స్థానికేతరులను తీసుకువస్తున్నారు. వీరు ఐదో షెడ్యూల్డ్ ప్రాంత ఆదివాసుల ప్రత్యేక హక్కుల కోసం కనీసం స్పందించరని, జీవో నెంబర్ 3, 1/70 భూ బాధలయింపు నియంత్రణ చట్టం, పెసా, అటవీ హక్కుల చట్టం వంటి అంశాలపై చట్టసభలలో కనీసం మాట్లాడటం లేదని విమర్శించారు. అలాగే ఏజెన్సీ ప్రాంత ఆదివాసులకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తురని అన్నారు. బోయవాల్మీకీ కులాలను ఎస్టీ జాబితాలో కలపడానికి రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ హోదాలో కుంభ రవిబాబు ఇచ్చిన తీర్మానమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. అదే షెడ్యూల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే అలా చేసి ఉండేవారే కాదని అన్నారు. కొత్తపల్లి గీత అభ్యర్థిత్వాన్ని ఆంధ్ర వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్, జనజాతి సరక్ష మంచ్ వంటి సంస్థలు వ్యతిరేకించినప్పటికీ బిజెపి పట్టించుకోలేదని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న ఆదివాసి వ్యతిరేక విధానాలను సమీక్షించుకొని 2024 ఎన్నికలలో ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయాన్ని ప్రకటిస్తామని రామారావు దొర తెలిపారు.