టిడిపి నాయకులతో ఆత్మీయ సమావేశం



ఎమ్మిగనూరు పట్టణంలోని తన స్వగృహంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అనగా 1982 నుండి టిడిపి పార్టీలో కొనసాగుతూ ఉన్న సీనియర్ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగినది. 



ఈ సమావేశంలో ముందుగా టిడిపి వ్యవస్థాపకులు కీ శే నందమూరి తారకరామారావు గారికి, మాజీ మంత్రి వర్యులు కీ శే BV మోహన్ రెడ్డి తో పాటు స్వర్గస్తులైన టిడిపి సీనియర్ నాయకులకు ఘన నివాళులు అర్పించి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సీనియర్ TDP నాయకులు అయిన మాబుసాబ్, రఘుమూర్తి స్వామి, లియాఖత్ అలి, మిఠాయి నరసింహులు, కొండయ్య చౌదరి, ఇబ్రహీం, షరీఫ్, దామా నరసింహులు, హాజి బడేసాబ్, నభిసాబ్, శంకరన్న, ఉసేన్ సాబ్, వెంకటకృష్ణమ నాయుడు, మాబు, రజాక్, అల్లబకాష్ , మాబు తదితరులను శాలువా వేసి పూలమాలలతో సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటున్న ఎమ్మిగనూరు నియోజకవర్గ TDP అభ్యర్థి  డా బి వి జయానాగేశ్వర రెడ్డి.