చికెన్, మటన్ తినే వారికి అలర్ట్

చికెన్, మటన్ తినే వారికి అలర్ట్



ఇండియన్​ కౌన్సిల్​ఆఫ్​ అగ్రికల్చర్​ రీసెర్చ్, ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్​ అండ్​ అగ్రికల్చరల్​ ఆర్గనైజేషన్ ఇటీవల చేసిన సంయుక్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కోళ్లు, మేకలు, రొయ్యలు, చేపల పెంపకంలో యాంటీ బయాటిక్స్ వాడకం పెరిగినట్లు గుర్తించారు. దేశంలో 10 రాష్ట్రాల నుంచి శాంపిళ్లను వారు సేకరించారు. కోళ్లలోనే ఎక్కువ శాతం యాంటీ బయాటిక్స్ ​రెసిస్టెన్స్ ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది.