పోలియో రహిత సమాజం కోసం "నేను సైతం"

పోలియో రహిత సమాజం కోసం "నేను సైతం" 

పోలియో అంతం కావాలి... 

నేటి బాలలే రేపటి భవిష్యత్తు..  



పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఇందుకూరిసీతారామరాజు (చిన్నబాబు) వైస్ ఎం.పి.పి పోడూరు మండలం. భారతదేశంలో "పల్స్ పోలియో వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్” ప్రారంభించి ఐదేళ్ల లోపు పిల్లలందరికీ ప్రతి సంవత్సరం రెండు డోసుల ఓరల్ పోలియో వ్యాక్సిన్ను అందజేసి, పిల్లలను పోలియో మాత్రమే కాకుండా అనేక ఇతర సంక్లిష్ట వ్యాధుల నుండి సురక్షితంగా ఉంచడానికి, వారికి పూర్తిగా టీకాలు వేయడం చాలా ముఖ్యమని అన్నారు. ఐదు సంవత్సరంలోపు వయసు ఉన్న ప్రతి పిల్లలకు వారి తల్లిదండ్రులు ఈ పోలియో చుక్కలు అందించే విధంగా చర్యలు తీసుకొని ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 



ఈ కార్యక్రమంలో వైస్ఎంపిపి  ఇందుకూరి సీతారామరాజు, పోడూరు గ్రామసర్పంచ్ శెట్టి బత్తులసువర్ణరాజు,  ఎమంసి వైస్ ప్రెసిడెంట్ సూరిబాబు, పోడూరు హెల్త్ ఆఫీసర్  పిహెచ్ వైద్యులు సత్యనారాయణ, మూర్తి, నర్సులు ఎఎంలు, గ్రామపెద్దలు, గ్రామనాయకులు తదితరులు పాల్గొన్నారని  ఇందుకూరి సీతారామరాజు (చిన్నబాబు) వైస్ ఎం.పి.పి పోడూరు మండలం. ఆచంట నియోజక వర్గం తెలిపారు.