అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరు గూడెం కొత్త వీధి మండలంలో ప్రపంచ క్షయ వ్యాధి దినోత్యవం సందర్భంగా రాలీ నిర్వహించడం జరిగింది.
సీలేరు ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించారు. వైద్యాధికారి మాట్లాడుతూ క్షయ వ్యాధి ఎలాసంక్రమిస్తుంది, క్షయ రోగులునను ఎలాగుర్తించాలి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షల నిర్వాహణకు లాబ్ లో అందుబాటులో సాంకేతికపరమైన మిషన్ అందుబాటులో ఉన్నదని, నిర్ధారణ అనంతరం మెరుగైన మందులు ఉచితంగా ఇస్తరనియు, వ్యాధిగ్రస్తుల కు ప్రత్యేకమైన అహారప్యకేజీ ఇవ్వబడుననియు, ఇది ప్రజలందరిని చైతన్యవంతం చేయడం అందరి భాద్యతాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమములో ఎంపీటీసీ పిల్లా సాంబమూర్తి, ఆరోగ్య విస్తరనాధికారి జోజి బాబు, HA సత్యన్నారాయణ, ఆరోగ్య కార్యకర్తలు KVN కుమారి, దేవి, అషాకార్యకర్త లు మరియు విద్యార్థులు హాజరైనారు.