అత్యంత చాకచక్యంగా పట్టుకున్న గాంజ

అనకాపల్లి జిల్లా పోలీసు అత్యంత చాకచక్యంగా గంజాయి అక్రమ రవాణా కు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్., వారు ప్రశంసించి, నగదు రివార్డులు అందజేశారు.



అనకాపల్లి, మార్చి 20: తేది.19.03.2024 తెల్లవారుజామున 5 గంటలకు సబ్బవరం పి.ఎస్ క్రైమ్ నెంబర్:82/24 గంజాయి కేసులో పోలీస్ సిబ్బంది పి.సి:2008, పి.పరదేశి నాయుడు, హెచ్.జీ:557 జె.నాగేశ్వరరావు లు విధులు నిర్వహిస్తుండగా అనుమానాస్పదం గా వెళ్తూ, పోలీసులను చూసి తప్పించుకునే క్రమంలో  ఎంతో చాకచక్యంతో ఆటోను నిలువరించి, తనిఖీ చేయగా (16 ప్యాకెట్లు) 32.980 కేజీల గంజాయి లభ్యమయింది. చింతపల్లి నుండి సబ్బవరం మీదుగా తుని కి గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, గంజాయిని, ఒక ఆటో, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఎస్పీ  ప్రశంసంచి, నగదు రివార్డులు అందజేశారు. 



ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసులు స్టాటిక్ చెక్ పోస్ట్ లు, డైనమిక్ చెక్ పోస్ట్ లు, గస్తీ పోలీస్ సిబ్బంది ముమ్మర తనిఖీలు నిర్వహించి అక్రమ గంజాయి, నాటు సారా, మద్యం రవాణా అరికట్టాలని, నగదు ఇతర ఉచిత కానుకలు పంపిణీ నిరోధించడానికి పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం, అనకాపల్లి.