ఆటోలో కొట్టుకుంటూ ఎత్తుకెళ్లి అతని వద్ద నుండి బంగారం

ఆటోలో కొట్టుకుంటూ ఎత్తుకెళ్లి అతని వద్ద నుండి బంగారం దోచుకున్నారు. 

కడప నగరంలో 2 టౌన్ స్టేషన్ పరిధిలో ఈ ఉదయం తనను కొంతమంది దుండగులు కిడ్నాప్ చేశారని ఇలియజ్ అనే వ్యక్తి ఆరోపించారు. 



ఆటోలో కొట్టుకుంటూ ఎత్తుకెళ్లి అతని వద్ద నుండి బంగారం దోచుకెళ్లినట్టు బాధితుడు ఇలియాజ్ తెలిపారు. దుబాయ్ నుండి తన కష్టార్జితంతో తెచ్చుకున్న బంగారను తనను బెదిరించి లాక్కోని వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు.  తన పేరుతో బంగారు కొనుగోలు చేసిన బిల్లులు సైతం ఉన్నాయని తనకు న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నాడు.