దేశంలో చెత్త మీద పన్నులు వేసే చెత్త ప్రభుత్వం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో చెత్త మీద పన్నులు వేసే ప్రభుత్వం ఎక్కడ చూడలేదు అని ఆయన ఎమ్మిగనూరులో విమర్శించారు. ఈ ప్రభుత్వానికి గద్దె దింపే రోజులు దగ్గర పడ్డాయని 17వ వార్డు మైనార్టీ కాలనీలో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించి తెలియజేశారు. వైసిపి ప్రభుత్వం అన్ని రంగాల వారికి మోసం చేసిందని మండిపడ్డారు. టిడిపి, జనసేన, బిజెపి, ల ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అని రంగాల వారికి తెలుగుదేశం పార్టీ న్యాయం చేస్తుందని ప్రజలకు హామీ ఇచ్చారు.