కుటుంబ సభ్యులకు పరామర్శించిన కరాటే క్లబ్ చీఫ్ ఇన్స్ట్రక్టర్


అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా అల్లురి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం ఇంజరి పంచాయితీ ఎర్రబాయలు గ్రామం లో గతనెల 2వ తేదీన జరిగిన సంఘటన పై ఈరోజు కరాటే అసోసియేషన్  స్టూడెంట్స్, మరియు కోఫూకాన్ కరాటే క్లబ్ చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఎగ్జామినార్ బాకూరు పాండు రాజు గ్రామంలో దాడి జరిగిన కుటుంబాల ఇండ్లకు  వెళ్లి కుటుంబ సభ్యులకు పరామర్శించి, మనోదైర్యంగా ఉండాలని గ్రామస్తులకు తెలియజేయడమైనది. 



ఈ సందర్భంగా గ్రామస్తులు మరియు మహిళలు కలసి వాళ్ళ సమస్యని వినతి పత్రం రూపంలో అందించారు. ఈ కార్యక్రమములో బ్లాక్ బెల్ట్ కరాటే ఇన్స్ట్రక్టర్స్ పాంగి చిన్నారావు, పాంగి అచ్చి బాబు, ప్రేమ్ కుమార్ మరియు కరాటే క్లబ్ సభ్యులు మర్రి బాలరాజు, తిమోతి స్టూడెంట్స్ పాల్గొన్నారు.