టిడిపి నుండి వైసీపీ పార్టీలోకి చేరికలు

వైయస్సార్సీపి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై టిడిపి నుండి వైసీపీ పార్టీలోకి చేరికలు



కర్నూలు మండలంలోని దీన్నే దేవరపాడు గ్రామానికి చెందిన టిడిపికి చెందిన 200 కుటుంబాలు గ్రామ వైసిపి నాయకులు పెరుగు భాస్కర్ రెడ్డి, పెరుగు శ్రీధర్ రెడ్డి, ఎంపీటీసీ రామ్నాథ్ రెడ్డి, అఖిలేష్ రెడ్డి ఆధ్వర్యంలో కోడుమూరు నియోజవర్గ సమన్వయకర్త, కుడా చైర్మన్ కోట్ల కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ గార్లు వైఎస్ఆర్సిపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాలు అన్నదమ్ములు, అయ్యన్నమూర్తి, బోయ దుబ్బన్న,  మాజీ సర్పంచ్ కారం నాగన్న, బోయ రామాంజనేయులు, రాజు, మద్దిలేటి, A. రాజగోపాల్, రాముడు, పెద్ద మద్దిలేటి (మాదిగ), అర్జునుడు, సంజీవనాయుడు, వెంకటేష్, శంకర్, మనోహర్, తదితర నాయకులు, గ్రామస్థులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలోకి చేరిన నాయకులు మాట్లాడుతూ జగనన్న చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.. ఎన్నడూ లేనివిధంగా వైఎస్సార్ సీపీ పార్టీ ద్వారానే అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా ఇంటికి అందుతున్నాయన్నారు.. కావున రానున్న ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని, అలాగే కర్నూలు ఎంపీగా బివై రామయ్య గారిని, ఎమ్మెల్యేగా డా.అదిమూలపు సతీష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు మా వంతు కృషి చేస్తామని తెలిపారు..