బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ

మంత్రాలయం లో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం..



రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోసం ప్రతి ఒక్కరు పని చేయాలి. మంత్రాలయం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా పోటిచేస్తాను, కచ్చితంగా గెలిచి అసెంబ్లీ కి పోతాను. కోసిగి టౌన్ నాయకులు కార్యకర్తలు తో సమీక్ష సమావేశంలో పాలకుర్తి తిక్కారెడ్డి నన్ను ఆశీర్వదించాలని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు



బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రజలకు సంపూర్ణ పరిపాలన అందించాలని ఉద్దేశంతోనే స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు అని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని మంత్రాలయం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తాం అని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బాధ్యులు పాలకుర్తి తిక్కారెడ్డి  అన్నారు. మంత్రాలయం లో తెలుగుదేశం పార్టీ ఆఫీసు లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించి తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.



ఈ కార్యక్రమంలో కోసిగి టౌన్ ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు తో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం పాలకుర్తి తిక్కారెడ్డి  మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను కచ్చితంగా పోటీ చేస్తాను మీరు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మంత్రాలయం నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తామని నేను కచ్చితంగా అసెంబ్లీకి పోతానని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు.

మీ అందరి ఆశీస్సులు కావాలని పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పాలకుర్తి దివాకర్ రెడ్డి, తెలుగు యువత నియోజకవర్గం అధ్యక్షులు సుదీర్ రెడ్డి, మత్సకార రాష్ట్ర మాజీ డైరెక్టర్ నవీన్, మంత్రాలయం మండల కన్వీనర్ పన్నాగా వెంకటేశప్ప స్వామి, వ్యాసరాచ స్వామి, తెలుగు వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరత్వాజ్ శెట్టి, యల్లారెడ్డి, సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, నాడిగేని అయ్యన్న, నాడిగేని రంగన్న, బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి, కోండగేని వీరారెడ్డి, టౌన్ అధ్యక్షులు పంపాపతి, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉమర్ సాబ్, ఖలదర్, వడ్డే రామయ్య, నాడిగేని వీరారెడ్డి, నర్సారెడ్డి, కప్పయ్య, డీలర్ నరసన్న, తెలుగు యువత మండల అధ్యక్షులు నాడిగేని మహాదేవ, గవిగట్టు ఈరయ్య, గుండాల ఈరయ్య, వక్రాని వెంకటేశ్వర్లు,యం పి టి సి సభ్యులు రాజు, మారేప్ప, నరసింహులు, ఉరుకుందు, మారేష్ ,లీగల్ సెల్ నాగరాజు, క్రిష్ణ తేజా, తెలుగు మహిళ నాడిగేని నర్సమ్మ, రూతమ్మ, శంకుతలమ్మ, సరోజమ్మ,లక్ష్మి, ఐటిడిపి పర్సాని హనుమంతు, ఉసేని తదితరులు పాల్గొన్నారు.