జర్నలిస్టుల సమస్యలను మేనిఫెస్టో లో చేర్చండి అంటూ రాజకీయ పార్టీలకు ఏపీయుడబ్లూజే విజ్ఞప్తి చేస్తూ వైసిపి అభ్యర్థి బుట్టా రేణుక కు వినతి పత్రం అందజేత..
ఎమ్మిగనూరు టౌన్, మార్చి 23....... జర్నలిస్టుల సమస్యలను రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టో లో చేర్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్లూజే) ఎమ్మిగనూరు తాలూకా అద్యక్షుడు బీ శ్రీనివాస నాయుడు, ప్రధాన కార్యదర్శి చిన్నాకుల నాగరాజు కోరారు. శనివారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా జాతీయ జర్నలిస్టుల కోరికల దినోత్సవం ను పురస్కరించుకొని ఎమ్మిగనూరు వైసిపి అభ్యర్థి బుట్టా రేణుక ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీ శ్రీనివాస నాయుడు, చిన్నాకుల నాగరాజు, జీబీ పరమేష్ మాట్లాడుతూ మీడియా కమిషన్ ను ఏర్పాటు చేసి జర్నలిస్టుల మీడియా భద్రకు జాతీయ స్థాయి లో ప్రత్యేక చట్టం చేయాలి. వర్కింగ్ జర్నలిస్ట్స్ చట్టాన్ని పునరుద్ధరించి దాడులను అరికట్టాలి. జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి. 3 సెంట్లు ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.ఈ సమస్యలు ను వైసిపి మేనిఫెస్టో లో చేర్చే విధంగా చూడాలని బుట్టా రేణుక ను కోరారు.