ఎమ్మిగనూరు నియోజకవర్గం ఎమ్మిగనూరు పట్టణ కేంద్రంలోని 4 వ వార్డులో బాబు షూరిటీ - భవిష్యత్ గ్యారెంటీ ద్వారా అందించే సూపర్ సిక్స్ పథకాలను ప్రతి గడప గడప తిరుగుతూ ప్రజలకు వివరించారు,ఎమ్మిగనూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ B.V జయ నాగేశ్వర రెడ్డి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ రెడ్డి పాలనలో ఏ వర్గానికి చెందిన వారు కూడా సంతోషంగా లేరని, బాబు వస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేశారు.
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావాలంటే, ఇక్కడ సైకిల్ రావాలన్నారు. మన ప్రాంతానికి తాగునీరు, రావాలంటే తెలుగుదేశం గెలవాలన్నారు. బటన్ నొక్కుతున్న, బటన్ నొక్కుతున్న అంటూ ప్రజల పీకలు నొక్కాడు తప్పితే ప్రజలకు చేసింది ఏమీ లేదు. సిద్ధం సిద్ధమంటూ ఫ్లెక్సీలు వేసుకున్నాడు కానీ, అభివృద్ధి మాత్రం శూన్యం. మన త్రాగడానికి నీరు రావాలన్నా, మన పొలాలకు సాగునీరు కావాలన్నా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం, సైకిల్ రావాలన్నారు.