అల్లూరి జిల్లాలో సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణీ మృతి
అంతర్జాతీయ మహిళా ధినోత్సవం రోజు సకాలంలో వైద్యం అందక గర్బిణీ మృతిచెందిన సంఘటన అల్లూరి జిల్లాలో చింతపల్లి మండలంలో జరిగింది. చింతపల్లి మండలంలోని రాళ్లగెడ్డ కొత్తూరుకు చెందిన బొంజు శాంతి 9 నెలలు గర్బీణీ.
శుక్రవారం మద్యాహ్నం12 గంటలకు పురిటినొప్పులు రావడంతో ఆశా కార్యకర్తకు అంబులెన్స్‌కు ఫోన్‌చేయగా, రహదారులు బాగలేకపోవడంతో అంబులెన్స్ ఆలస్యం కావడంతో ఆటోలో కోరుకొండ ఆసుపత్రికి తరలించారు.
ఆ సమయానికి వైద్యాదికారి మెడికల్ క్యాంపుకు వెళ్లారని, స్టాఫ్ నర్స్‌లు శాంతికు వైద్యం చేయడానికి సిద్దమవుతున్న తరుణంలో ఆసుపత్రిలో సరైన వైద్యపరికరాలు లేవంటూ అంబులెన్స్‌లో చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలోనే శాంతి మరణించిందని భర్త చిట్టిబాబు అన్నారు. శాంతికి ముగ్గురు చిన్నారులు ఉన్నారు. తల్లి మరణంతో ఈ చిన్నారులు ముగ్గురు అనాథలయ్యారు.