YCP ప్రభుత్వానికి చెత్తపై పన్నులు వసూలు చేసే శ్రద్ద వార్డుల పరిశుభ్రతపై లేదు

YCP ప్రభుత్వానికి చెత్తపై పన్నులు వసూలు చేసే శ్రద్ద వార్డుల పరిశుభ్రతపై లేదు: ఎమ్మిగనూరు TDP అభ్యర్థి డా బి వి జయనాగేశ్వర రెడ్డి



26-03-2024న ఎమ్మిగనూరు పట్టణంలోని 4వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మిగనూరు TDP అభ్యర్థి డా బి వి జయనాగేశ్వర రెడ్డి గారికి వార్డు ప్రజలు తమ సమస్యలను వెళ్లబోసుకున్నారు. వార్డులో కనీసం డ్రైనేజీలు కూడా పరిశుభ్రం చేయకపోవడం వలన అనేక రోగాలకు గురవుతున్నామని వాపోయారు. వైసిపి ప్రభుత్వానికి చెత్తపై పన్నులు వసూలు చేసే శ్రద్ద వార్డుల పరిశుభ్రతపై లేదని ఆయన పేర్కొన్నారు. అపరిశుభ్రంగా ఉన్న డ్రైనేజీ కాలువలు YCP ప్రభుత్వానికి గానీ మున్సిపల్ అధికారులకు కానీ కనిపించడం లేదా? ప్రజల ఆరోగ్యం పట్ల YCP ప్రభుత్వానికి వారి పాలకులకు ఉన్న చిత్తశుద్ది తేటతెల్లమైంది అని పేర్కొన్నారు. 



ప్రజలను పీడించి నెల నెలా ప్రతి ఇంటి నుండి చెత్త పన్ను వసూలు చేస్తున్నారు కానీ కనీసం డ్రైనేజీలు కూడా క్లీన్ చేయడం లేదని YCP ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి స్థానిక MLA చెన్నాకేశవ రెడ్డి కి సెల్ఫ్ ఛాలెంజ్ చేస్తున్న ఎమ్మిగనూరు TDP అభ్యర్థి  డా బి వి జయనాగేశ్వర రెడ్డి