స్థానిక గోనెగండ్ల మండలంలోని వేముగోడు గ్రామానికి చెందిన వైయస్సార్సీపిపార్టీ నాయకులు గొబ్బెరిగాళ్ళ నాగేంద్ర, గొబ్బిరిగాళ్ళ వెంకటేష్, కురువా సురేష్, రాజోలి రాముడు, ముస్లిం బావన్న, కూరువ మాదన్న మరియు వారి అనుచరులు సుమారు 100 మంది వేముగోడు గ్రామ టిడిపి నాయకుల ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం టిడిపిఅభ్యర్థి డా బి వి జయనాగేశ్వర రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరినారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన పోయి సుపరిపాలన వచ్చి రైతులతో పాటు ప్రజలందరికీ మంచి రోజులు రావాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, రాష్ట్రంలో రాక్షస పాలన సంహరించడానికి ప్రతి ఒక్కరూ చేయి కలపాల్సిన సమయం ఆసన్నమైంది అని పేర్కొని టిడిపి పార్టీ ప్రవేశ పెట్టిన సుపర్ 6 పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు వారు ప్రకటించారు. ఈ సంద్భంగా వీరికి టిడిపి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్న ఎమ్మిగనూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి డా జయానాగేశ్వర రెడ్డి.