విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ప్రెస్ మీట్

విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గం ప్రెస్ మీట్ లో పాల్గొన్న వైఎస్ఆర్సిపి పశ్చిమ నియోజకవర్గం పరిశీలకులు డా.బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు మరియు రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పేడాడ రమణికుమారి...



ఈ రోజు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గం కార్యాలయం లో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కె.కె రాజు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ 2014లో మేనిఫెస్టో పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను మోసం చేశారని విమర్శించారు. 2019 అధికారంలోకి వచ్చిన జగన్ మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నింటినీ అమలు చేసి చూపించారని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా హామీల అమలును కొనసాగించారని కొనియాడారు.



ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అద్యక్షులు కోలా గురువులు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,VKPCPIR చైర్మన్,విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకటరావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ రావు, రాష్ట్ర, పార్లమెంట్, సిటీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, పార్టీ మండల అద్యక్షులు,మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు,రాష్ట్ర మరియు బిసి కార్పొరేషన్ చైర్మన్&డైరెక్టర్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులు& సభ్యులు, JCS మండల కన్వీనర్లు, సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.