ఎమ్మిగనూరు నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన శ్రీమతి బుట్టారేణుక.
హాజరైన ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, జిల్లా వైసిపి ఎంపి అభ్యర్థి బీవై రామయ్య
ఎమ్మిగనూరు: అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థి బుట్టారేణుకతో పాటు పార్టీ శ్రేణులు అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ జన నీరాజనం పలికారు.
గురువారం పట్టణంలోని స్థానిక వైసిపి కార్యాలయం నుంచి వైఎస్సార్ సర్కిల్ మీదుగా వేలాది మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీగా ఎమ్మార్వో కార్యాలయం వరకు ఊరేగింపు నిర్వహించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, కర్నూలు జిల్లా వైసిపి ఎంపి అభ్యర్థి బీవై రామయ్య, వీరశైవ లింగాయత్ అధ్యక్షులు రుద్రగౌడ్, కుర్ణీ కార్పొరేషన్ చైర్మన్ బుట్టా శారదా గారు, మండల కన్వీనర్ బిఆర్. బసిరెడ్డి తో పాటు ఇతర సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.