ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కడదాం

ఎమ్మిగనూరు పట్టణం నందు ఈరోజు ఉదయం ఎమ్మిగనూరులోని 21 వార్డ్ ఇంచార్జ్ తార రాజశేఖర్ ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్టా రేణుకమ్మ  ఆదేశాల మేరకు ఎన్నికల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 



21 వార్డ్ ఇంచార్జ్ తార రాజశేఖర్ మరియు జిల్లా ప్రచార కార్యదర్శి సయ్యద్ చాంద్ సచివాలయం కన్వీనర్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 99శాతం అమలు చేశామన్నారు. చెప్పిన వాటితో పాటు చెప్పనివి కూడా ప్రజల అభ్యున్నతి కోసం అమలు చేశామన్నారు. 



జగనన్న ప్రభుత్వంలోని సంక్షేమ ఫలాలను మరియు అభివృద్ధిని వివరించారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రావాలని కోరారు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మన నాయకురాలు బుట్టా రేణుకమ్మ గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించాలని అభ్యర్థించారు.


 *