వామ్మో ప్రెస్ మీట్ లా...లేక ఈట్ లా!!!....

దివిసీమ ప్రాంతం...

వామ్మో ప్రెస్ మీట్ లా...లేక ఈట్ లా!!!....

యూట్యూబర్ల, సర్క్యులేషన్ లేని పేపర్ వాళ్లతో బెంబేలెత్తుతున్న రాజకీయ నాయకులు.!!



ఎలక్షన్ల ముంచుకొస్తున్న తరుణంలో అడ్డు అదుపు లేకుండా యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయాయని కొంతమంది రాజకీయ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రెస్ మీట్ లు పెట్టాలంటే నిజమైన జర్నలిస్టులు ఎవరు? యూట్యూబర్ లు ఎవరో, శాటిలైట్ ఛానల్ ఏమి ఉన్నాయి, అసలు మనం పెట్టే ప్రెస్ మీట్ ఏ ఛానల్ లో వస్తాది, ఏ పత్రికలో వస్తాదో అని తెలియని అయోమయ పరిస్థితుల్లో ప్రెస్ మీట్ లు పెట్టాలంటే రాజకీయ నాయకులు భయపడిపోతున్నారు. కొంతమంది యూట్యూబర్ లు మాది మంచి ఛానల్ అని,మేమే ఇక్కడ అన్ని చూసుకుంటామని,మీరు పెట్టే ప్రోగ్రామ్స్ అన్ని మేమే దగ్గరుండి చూసుకుంటామని పేటీఎం బ్యాచ్ లు ఎక్కువయ్యారు...ఒక ఇంటిలో ముగ్గురు నలుగురు పేర్లుతో కొత్త కొత్త యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేసి,వారే లోగోలు తయారు చేసుకుని,వారే యాంకర్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రెస్ మీట్ పెడితే ఒక కుటుంబంలో ముగ్గురు లేక నలుగురు యూట్యూబ్ లోగోలు వేసుకుని వచ్చేస్తున్నారు, గ్రూపుల్లో యూట్యూబ్ లింకులు పెడుతూ వాటిని ఓపెన్ చేయగానే ఆయా యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ల వాయిస్ వినలేక ప్రజలు,రాజకీయ నాయకులు సమాజంలో మీడియా అంటేనే ఛీ...తూ అనే విధంగా తయారయింది. ఇలా ఒక ప్రెస్ మీట్ పెడితే యూట్యూబర్ లతో కలిపి నకిలీ విలేకరులు సుమారుగా 150 మంది ప్రెస్ మీట్లకు హాజరవుతున్నారు, ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే బాగా ఖర్చవుతుందని రాజకీయ నాయకులు లబోదిబో మంటున్నారు,వీరంతా ప్రెస్ మీట్లకు వచ్చేది ఎందుకు వారిచ్చే కవర్ల కోసమా, సమాజంలో జరుగుతున్న చెడుపై వార్తలు రాసే వారు ఎంతమంది ఉన్నారు,ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా నిలబడే వారు ఎంతమంది ఉన్నారు,ఏమైనా సమస్యలు ఉంటే అలాంటి ప్రాంతంలో వీరెందుకు అక్కడికి వెళ్ళరు, సమస్యలున్న ప్రాంతానికి వెళ్తే అక్కడ డబ్బులు రావా, ప్రెస్ మీట్లకు వెళితే టిఫిన్లు భోజనాలు పెట్టి డబ్బులు కూడా వస్తాయని ఉద్దేశంతో నేనా? ఒకప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఆయా ప్రాంతాల్లో ఉండే విలేకరులకు మాత్రమే ఫోన్ చేసి చెప్తారు కానీ ఇప్పుడు గ్రూపులో ప్రెస్ మీట్ ఉందని మెసేజ్ పెట్టగానే చైన్ లింకు సిస్టం ద్వారా వందల మంది ప్రెస్ మీట్ కి వచ్చేస్తుంటే, ఆ ప్రెస్ మీట్ పెట్టేవారు వారి ముందు ఉన్నది శాటిలైట్ ఛానల్ లేక యూట్యూబ్ ఛానల్ అని వారి ముందు పదుల సంఖ్యలో ఉన్న ఆ లోగోలు చూసి భయపడి పోతున్నారు. ఇకనుంచి ప్రెస్ మీట్ లు పెట్టాలంటే వారు కచ్చితంగా ప్రెస్ మీట్ సోషల్ మీడియా వారికి మాత్రమేనని,లేక యూట్యూబ్ ఛానల్ కు మాత్రమేనని, లేక ఎలక్ట్రానిక్ మీడియా వారికి మాత్రమేనని,లేక ప్రింట్ మీడియా వారికి మాత్రమేనని పెడితే..అప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టే వారి ఖర్చు తగ్గుతుంది,వారు ప్రెస్ మీట్ ఎవరిని ఉద్దేశించి పెట్టారో ఆ ప్రెస్ మీట్ పెట్టినందుకు న్యాయం జరుగుతుంది, అని రాజకీయ నాయకులు తర్జనభర్జన పడుతున్నారు. అందరూ సమాజంలో ఇలా కనక చేస్తే ముఠామేస్త్రిలు , తాపీ పని చేసుకునే వాళ్ళు, పునుగులు, బజ్జీలు, నూడిల్స్ అమ్ముకునేవారు మీడియా రంగంలోకి రాకుండా వారి పని వారు చేసుకుంటే ఫోర్త్ ఎస్టేట్ పరువు నిలబడుతుందని దివిసీమ ప్రాంత జర్నలిస్టుల అభిప్రాయం..