నామినేషన్ కొరకు పిలుపు

జై మహా భారత్ జాతీయ పార్టీ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి బొంకు అర్జున్..
కుటుంబ సభ్యులు అభిమానులు పార్టీ శ్రేణులు హాజరుకాగలరు- పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బొంకు అర్జున్ ...

ప్రజలకు సేవా చెయ్యాలని మంచి ఉద్దేశ్యంతో రాజకీయరంగా ప్రవేశం చేపడుతున్నానని జాతీయ పార్టీ జై మహా భారత్ పాడేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పిలుపునిస్తున్నాను. గిరిజన ప్రజలు అనుభవిస్తున్న సమస్యలపై పూర్తి అవగాహనా నాకు ఉన్నందున రాజకీయ ప్రవేశం చేసి మన ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాము. 



అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యురు మండలం బూదరాళ్లు గ్రామానికి చెందిన బొంకు సుబ్బారావు తనయుడు బొంకు అర్జున్ అనే నేను నిరుపేద కుటుంబం నుండి వచ్చాను. నేను కష్టాల యొక్క బాధలను దగ్గరుండి అనుభవించిన వ్యక్తిని. ఎందరో విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి నేను ముందడుగు వేస్తున్నాను. మన్యంలో అమాయక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిర్మూలించటానికే రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను. మన్యంలో చాలా సమస్యలను పార్టీ అధిష్టానానికి తెలియజేయడం జరిగిందన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు అనంత విష్ణు ప్రభు చేతుల మీదుగా సోమవారం నాడు భీ ఫారంను తీసుకోవటం జరిగింది. పార్టీ అధ్యక్షులు ఆదేశాల మేరకు గురువారం నాడు అనగా రేపు ఉదయం 10 గంటల సమయానికి పాడేరు కార్యాలయంలో నామినేషన్ వెయ్యాలని నిర్ణయించడం జరిగినది. కావున నామినేషన్ వెయ్యటానికి బంధుమిత్రులు కార్యకర్తలు అభిమానులు పార్టీ శ్రేణులు పాల్గొని జయప్రదం చెయ్యాలని ప్రేమతో పిలుపునిస్తున్నాను ఆంటూ మీడియాకు తెలియజేసారు.