డాక్టర్ మస్తాన్ వళ్ళి అధ్యక్షతన ర్యాలీ

సీలేరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా యావన్మంది సిబ్బందితో స్థానిక వైద్యాధికారి డాక్టర్ మస్తాన్ వళ్ళి అధ్యక్షతన ర్యాలీ నిర్వహించడం జరిగినది.  వైద్యాధికారి మాట్లాడుతూ మలేరియా వ్యాది వ్యాప్తి, నిర్ములన, ప్రజల భాగస్వామ్యం, కోసం విశ్లేషించి మాట్లాడడం జరిగినది.



దోమ ఉనికి పై దండయాత్ర గా, ఫ్రైడే ఫ్రైడే పాటించాలని హితవు పలికారు. పరిసరాల పరిశుభ్రత, పై అవగాహన కలిగి ఉండాలని హితవు పలికారు. దీనికి ప్రజలు ప్రజాప్రతినిధులు వైద్య సిబ్బంది అందరూ సమన్వయంతో సమిష్టిగా పోరాడాలని తెలిపారు నీటి నిలువ ఉన్న గుంతలను పూడ్చలని, పాత ఫ్రిజ్లు టైర్లు ఓవర్ హెడ్ ట్యాంకులు కూలర్స్ వై తొలగించాలని తెలిపినారు సదరు కార్యక్రమానికి ఆరోగ్య విస్తరణ అధికారి కె జోజి బాబు పర్యవేక్షకులు ఎన్ త్రినాధ రావు హెల్త్ అసిస్టెంట్ సత్యనారాయణ ఎల్ టి శివ ఫార్మసిస్టు సాయికృష్ణ , స్టాఫ్ నర్స్ దేవి, ఎఎన్ యం కుమారి ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.