సత్తా చాటిన గుడ్ షప్పర్డ్,గుడ్ బేస్ స్కూల్స్ విద్యార్థులు

మై డ్రీమ్ కాంపిటేటివ్ ఎక్జామ్ లో సత్తా చాటిన గుడ్ షప్పర్డ్,గుడ్ బేస్ స్కూల్స్ విద్యార్థులు.



ఎమ్మిగనూరు:-పట్టణంలోని గుడ్ షప్పర్డ్, గుడ్ బేస్ పాఠశాలలలో ఆర్వీపీఎస్(రాయలసీమ విద్యార్థి పోరాట సమితి) ఆధ్వర్యంలో 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన "మై డ్రీమ్ కాంపిటిటేటివ్ టెస్ట్"ను ఫిబ్రవరి నెలలో నిర్వహించారు.



మైడ్రీమ్ కాంపిటేటివ్ ఎక్జామ్ లో ప్రతిభను కనబరచిన విద్యార్థులకు పాఠశాలల యాజమాన్యాలు జాన్ మోసెస్,గుడ్ బేస్ స్కూల్ ఛైర్మన్ వాసుబాబు, ప్రిన్సిపాల్ ఎబెల్ రాజ్  బహుమతులు, మొమెంటోస్, మెడల్స్ మరియు సర్టిఫికెట్లను అందచేసీ విద్యార్థిని, విద్యార్థులను అభినందించారు.



ఈ సందర్భంగా జాన్ మోసెస్, వాసు బాబు, ఎబెల్ రాజ్, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి నల్లారెడ్డి యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు కాంపీటేటివ్ ఎక్జామ్స్ పట్ల భయాన్ని పొగొట్టి భవిష్యత్తులో వారికి ఎదురయ్యే వివిధ కాంపీటేటివ్ ఎక్జామ్స్ ను ధైర్యంగా ఎదురుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంను నిర్వహించడం జరిగుతుందని అన్నారు.



స్కూల్ యాజమాన్యాలు మాట్లాడుతూ ఇటువంటి ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడంలో గుడ్ షప్పర్డ్, గుడ్ బేస్ పాఠశాలల యాజమాన్యాలు ఎల్లప్పుడూ ముందుంటాయని వారు  తెలిపారు. ఈ కార్యక్రమంలో వినయ్, చెన్నప్ప, బస్సప్ప ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.