ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం నందు పౌర్ణమి సందర్భంగా సద్యోమూర్తి హారతులు మరియు శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి నగరోత్సవం కనులు పండుగ నిర్వహించారు.
ఈ ఉత్సవంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్.వి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వాన సభ్యులు సుబ్బారావు దేవస్థానం అధికారులు అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, టెంపుల్ సూపర్డెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్,
ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏఈ శివ కిషోర్, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, దేవస్థాన సిబ్బంది సుదర్శన్ రెడ్డి, రాజా, దేవస్థాన అర్చకులు రాము గురుకుల్, మరియు ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.