AP: నెల్లూరు జిల్లా జైలులో కలకలం రేగింది. దుర్గా అనే ఖైదీ ఉరేసుకుని జైలులోనే ఆత్మహత్య చేసుకుంది. ఖైదీ కుటుంబసభ్యులకు జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. అనంతరం జైలు అధికారులు దుర్గ మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దుర్గ ప్రస్తుతం భర్త హత్య కేసులో జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంది.