ఎన్నికల హడావుడిలో అక్రమ కట్టడాలు తారస్థాయికి చేరుకుంది హుకుంపేట లో....
అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో అక్రమ కట్టడాలు తారస్థాయికి చేరుకుంది రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. నోటీసులు ఇచ్చిన సరే పట్టించుకోని గిరిజ నేతరులు . ఎన్నికల సమయంలో అధికారులు బిజీ గా ఉన్నారని ఇదే మంచి సమయం అని అక్రమ కట్టడాలు కడుతున్నారు. హుకుంపేట లో ఉన్న వెలుగు ఆఫీస్ స్థలంలో బుడ్డిగా కొండ మ్మ అక్రమ కట్టడాలు కడుతున్నారు. డిప్యూటీ తహశీల్దార్ ఈ అక్రమ కట్టడాలు మీద చర్యలు తీసుకోని ఆపేశారు. కానీ తాజాగా ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని గిరిజ నెతరులు రెచ్చిపోతున్నారు. ఇప్పటి కైన అధికారులు స్పందించి అక్రమ కట్టడాలు అపగలరని ఆశిస్తున్నాము.